హయ్యా కార్డుదారుల కోసం ఇ-వీసా సేవలను ప్రారంభించిన సౌదీ

- October 17, 2022 , by Maagulf
హయ్యా కార్డుదారుల కోసం ఇ-వీసా సేవలను ప్రారంభించిన సౌదీ

రియాద్ : ఖతార్ ఫిఫా ప్రపంచ కప్ 2022 కోసం హయ్యా ఫ్యాన్ కార్డ్ హోల్డర్లు ఉచితంగా రాజ్యంలోకి ప్రవేశించడానికి వీసా పొందేందుకు వీలు కల్పించే ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హయ్యా కార్డ్ హోల్డర్లు యూనిఫైడ్ వీసా ప్లాట్‌ఫారమ్ ద్వారా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ https://visa.mofa.gov.sa ద్వారా వీసా దరఖాస్తును సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. హయ్యా కార్డు హోల్డర్ల కోసం సౌదీ అరేబియాకు ప్రవేశ వీసా జారీ చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇ-వీసా సేవా ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన ఇ-సేవలకు అయ్యే ఖర్చులను రాష్ట్రమే భరిస్తుందని మంత్రి మండలి గత మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.  హయ్యా కార్డ్ అనేది FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 మ్యాచ్‌లలో దేనికైనా హాజరయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి జారీ జారీ చేసిన ఎంట్రీ సర్టిఫికేట్. ప్రపంచ కప్ సీజన్‌లో హయ్యా కార్డ్ హోల్డర్‌లు 60 రోజుల వరకు సౌదీలో పర్యటించవచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com