బళ్లారిలో ఓటు వేసిన రాహుల్ గాంధీ
- October 17, 2022
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ లో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బళ్లారిలో ఏర్పాటు చేసిన భారత్ జోడో క్యాంప్ సైట్లోనే ఆయన ఓటు వేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, జైరామ్ రమేష్ సైతం ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.పార్టీ అధ్యక్ష బరిలో ఉన్న మల్లికార్జున ఖర్గే కూడా ఢిల్లీలో ఓటేశారు. పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!