భారతీయులకు అమెరికా శుభవార్త
- October 17, 2022
అమెరికా: భారతీయులకు అమెరికా శుభవార్త తెలిపింది.హెచ్‌అండ్‌ఎల్ క్యాటగిరీ వీసాల జారీని వేగవంతం చేసింది. వీసా నిరీక్షణ సమయాన్ని కూడా తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. హెచ్‌అండ్‌ఎల్ క్యాటగిరీ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం లక్ష వీసా స్లాట్లను విడుదల చేసినట్టు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. దీనివల్ల 833 రోజులున్న వీసా నిరీక్షణ సమయం కూడా భారీగా తగ్గనుంది.
ప్రస్తుతం అమెరికా వీసాల కోసం భారతీయులు నిరీక్షించే సమయం ఇతర దేశాల కంటే ఎక్కువ. ఆ సమయం సగానికి తగ్గనుంది. ఉద్యోగ వీసాల కోసం ఇటీవల భారతీయుల నుంచి వస్తున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హెచ్‌అండ్‌ఎల్ వర్కర్స్, వారి కుటుంబాల కోసం లక్ష వీసా స్లాట్లను ప్రారంభించామని యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది. వీసా కోసం ఇప్పటికే వేల మంది అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొన్నారని తెలిపారు. ఇంటర్వ్యూ మినహాయింపు, మొదటిసారి అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించామని చెప్పారు.
ఈ బల్క్ అపాయింట్‌మెంట్ స్లాట్ల ప్రారంభం హెచ్‌అండ్‌ఎల్ ఉద్యోగుల పట్ల తమకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. 2022లో తొమ్మిది నెలల్లో యూఎస్ మిషన్ టు ఇండియా లక్షా 60వేల వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసిందని న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో పనిచేసే మినిస్టర్ కౌన్సెలర్ డాన్ హెఫిన్ తెలిపారు. వనరులకు అనుగుణంగా హెచ్‌అండ్‌ఎల్ ఉద్యోగులకు వీసా అపాయింట్‌మెంట్లు ఇచ్చేందుకు ప్రాధాన్యం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!