డ్రైవర్‌ను కొట్టిన వ్యక్తికి 10,000 దిర్హామ్ జరిమానా
- October 17, 2022
దుబాయ్: రోడ్డుపై డ్రైవర్‌పై దాడి చేసినందుకు 34 ఏళ్ల యూరోపియన్‌కు క్రిమినల్ కోర్టు 10,000 దిర్హామ్‌లు జరిమానా విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బాధితుడు జెబెల్ అలీ నుండి ఫెస్టివల్ సిటీ దిశగా అల్ ఖైల్ స్ట్రీట్ ఎడమ లేన్‌లో అనుమతించిన వేగంతో తన వాహనాన్ని నడుపుతున్నాడు. నిందితుడైన యూరోపియన్ నడుపుతున్న వాహనం అతని ముందు ఉంది. బాధితుడు ముందుకు వెళ్లేందుకు వీలుగా హైబీమ్‌ను ఉపయోగించి అతనికి సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నించాడు, కానీ అతను పట్టించుకోలేదు. దీంతో సమాంతర లేన్‌కు వెళ్లడం ద్వారా తన మార్గాన్ని మార్చుకున్నాడు. కానీ యూరోపియన్ వ్యక్తి తనను అనుసరించాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆపగానే నిందితుడు తన కారు వద్దకు వచ్చి కిటికీ తెరిచి డ్రైవర్ ముఖంపై కొట్టాడు. అనంతరం బాధితుడు పోలీసులు ఆశ్రయించాడు. ఫోరెన్సిక్ బృందం పరిశీలనలో నిందితుడు కొట్టడం కారణంగా బాధితుడికి గాయం అయిందని నిర్ధారించారు. అలాగే నిందితుడు కూడా పోలీసు విచారణ సందర్భోంగా తన తప్పును అంగీకరించాడు.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!