వాటర్ హీటర్‌ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసా?

- October 17, 2022 , by Maagulf
వాటర్ హీటర్‌ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసా?

మస్కట్: ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ వినియోగిస్తున్నప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మస్కట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఎంఈడీసీ) కోరింది. మస్కట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తన చందాదారులకు, వారి భద్రత, వారి కుటుంబాల భద్రత దృష్ట్యా ఎంఈడీసీ అప్రమత్తం చేసింది.

- వాటర్ హీటర్ ఉపయోగించే క్రమంలో తయీరీ సంస్థ నిర్దేశించిన సూచనలను పాటించాలి.

- ఎలక్ట్రిక్ హీటర్ వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదాలలో ఒకటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్. దీని నివారణకు పరికరాన్ని ఎలక్ట్రికల్ గ్రౌండింగ్‌కి కనెక్ట్ చేయాలి. విద్యుదాఘాతం నుండి రక్షించడానికి ఇది అత్యంత ముఖ్యమైన మార్గం.

- హీటర్ విద్యుత్ కనెక్షన్ల సమగ్రతను తరచ్చూ చెక్ చేసుకోవాలి. అలాగే నీటిని ఉపయోగించే ముందు హీటర్‌ను ఆపరేట్ చేయడానికి ఉపయోగించే బటన్‌ను స్విచ్ ఆఫ్ చేయడంలో జాగ్రత్త వహించాలి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలి.

- హీటర్‌ను వినియోగించిన తర్వాత థర్మోస్టాట్‌, హీటర్‌ను అంతర్గతంగా శుభ్రపరచాలి. అలాగే హీటర్ ను వినియోగించే ముందు తప్పకుండా తనిఖీ చేయాలని కంపెనీ సూచించింది. - ----- ట్యాంక్‌లో ఎక్కువ కాలం నిల్వ నీరు ఉంటే.. హీటర్ తుప్పు పడుతుంది.  ఇది హీటర్‌కు నష్టం కలిగిస్తుంది. అటువంటి సందర్భాలలో హీటర్‌ను మార్చాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com