పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ

- October 18, 2022 , by Maagulf
పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రత్వాన్ని వదులుకుని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. 2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. విశాఖ పరిణామాలు, పోలీసుల చర్యలపై వారు చర్చించారు. విశాఖలో జరిగిన ఘటనలపై చంద్రబాబు సంఘీభావం తెలిపారు.

ఈ సమావేశంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా పాల్గొన్నారు. ఇవాళ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా బీజేపీపై పొత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి ఇక దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇచ్చారు.

ఇదే సమయంలో ఆయన చంద్రబాబు నాయుడితో చర్చించడంతో టీడీపీ-జనసేన మళ్లీ కలుస్తాయన్న ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయన్న ఊహాగానాలు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com