యూఏఈలో మొట్టమొదటి డ్రైవ్-త్రూ బ్లడ్ టెస్ట్ సర్వీస్ ప్రారంభం
- October 18, 2022
యూఏఈ: దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) మరో అపూర్వమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. యూఏఈలో మొట్టమొదటి డ్రైవ్-త్రూ బ్లడ్ టెస్ట్ సర్వీసును ప్రారంభించింది. దుబాయ్‌లోని యునైటెడ్ మెడికల్ సెంటర్ (UMC) సహకారంతో ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ సెంటర్ (EIAC), ISO సర్టిఫికేట్ పొందిన ప్రముఖ స్విస్ డయాగ్నొస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ యూనిలాబ్స్(Unilabs) ద్వారా కొత్త సేవలను అందించనున్నట్లు డీహెచ్ఏ వెల్లడించింది. వైద్యుడి సిఫార్సు మేరకు ఎవరైనా డ్రైవ్-త్రూ రక్త పరీక్షలు చేయించుకోవచ్చని పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, వినియోగదారుల డిమాండ్‌లకు అనుగుణంగా కొత్త అధిక-నాణ్యత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ ఆరోగ్య నియంత్రణ సెక్టార్ CEO డాక్టర్ మార్వాన్ అల్ ముల్లా తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ