కువైట్‌లో అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్

- October 18, 2022 , by Maagulf
కువైట్‌లో అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్

కువైట్: అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్, సఫత్, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్, కువైట్-13015లో ఉదయం 11-12 గంటల వరకు నిర్వహించబడుతుందని ఎంబసీ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లు నిర్వహిస్తారన్నారు. కోవిడ్-19 టీకాలు తీసుకున్న కువైట్‌లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనవచ్చన్నారు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలనుకునే వారు తమ సందేహాలను పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్‌లోని సంప్రదింపు నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో ముందుగానే [email protected] కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని ఎంబసీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com