అరెరే రష్మిక.! బంపర్ ఛాన్స్ మిస్ చేసుకుందే.!

- October 18, 2022 , by Maagulf
అరెరే రష్మిక.! బంపర్ ఛాన్స్ మిస్ చేసుకుందే.!

తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకుంటోన్న రష్మికా మండన్నా, ప్రస్తుతం హిందీలో హవా చూపిస్తోన్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది బాలీవుడ్‌లో రష్మిక. రీసెంట్‌గా ‘గుడ్ బై’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది రష్మిక.
అలాగే మరో రెండు సినిమాలూ విడుదలకు రెడీగా వున్నాయ్. దీంతో పాటూ, తమిళంలోనూ రష్మిక జోరు చూపిస్తోంది. ఇప్పటికే విజయ్ సరసన ‘వారసుడు’ సినిమాలో నటిస్తోంది. కాగా, తమిళనాట అగ్రహీరోల్లో ఒకరైన చియాన్ విక్రమ్ సరసన ఓ సినిమాలో రష్మిక నటించాల్సి వుంది.
చియన్ 61గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం నుంచి కడపలో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో రష్మిక స్థానాన్ని మాళవిక మోహనన్ కొట్టేసిందట. అందుకు కారణం రష్మిక కాల్షీట్లు కేటాయించలేకపోవడం వల్లే. బాలీవుడ్ సినిమాలతో రష్మిక బిజీ అయిపోవడం వల్లనే విక్రమ్‌తో నటించే గోల్డెన్ ఛాన్స్ రష్మిక మిస్ చేసుకుంది.
ఇక, రష్మిక ఔట్ అవడంతో, ఆ ప్లేస్‌‌లోకి మాళవిక మోహనన్ తీసుకున్నట్లు తాజా సమాచారం. తెలుగు, తమిళంతో పాటూ, హిందీలోనూ ఈ సినిమా చిత్రీకరరణ జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com