రష్మీ-నందూ ఏంటీ రచ్చ.? అసలు మీకేమైంది.!

- October 18, 2022 , by Maagulf
రష్మీ-నందూ ఏంటీ రచ్చ.? అసలు మీకేమైంది.!

రష్మీ గౌతమ్‌కి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక నందూ, అంటే, టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు. సింగర్ గీతా మాధురి హజ్బెండ్. బాగానే వుంది కానీ, రష్మీ, నందూ గొడవపడడమేంటీ.? అసలు వీళ్లిద్దరికీ లింకేంటీ.? అనుకుంటున్నారా.?
అసలు విషయానికి వచ్చేద్దాం. నందూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రష్మీ గౌతమ్ ఫోన్ ఎత్తడం లేదట. సినిమా ప్రమోషన్లకీ రావడం లేదట. ఇలా కాదని రష్మీ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి నందూ పెద్ద గొడవ చేశాడు. రష్మీ ఏం తక్కువ తింటుందా.? నువ్వు పిలిస్తే నేను వచ్చేయాలా రానే రాను. అయినా నేను ఆ ప్రెజర్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు.. అంటూ నోటికొచ్చినట్లుగా వచ్చీ రాని తెలుగులో నందూని ఆడిపోసుకుంది.
అబ్బబ్బా.! ఏంటీ గొడవ అనుకుంటున్నారా.? ఇదో ప్రాంక్ వీడియో. నందూ, రష్మీ గౌతమ్ జంటగా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఎప్పుడో రెండేళ్ల క్రితమే విడుదల కావల్సిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది. 
జనం తమ సినిమాని మర్చిపోయి వుంటారన్న కోణంలో, ఇదిగో ఇలా డిఫరెంట్ ప్రాంక్ వీడియోతో ప్రమోషన్లు మొదలు పెట్టారు మన హీరో, హీరోయిన్లు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సినిమాకి మంచి ప్రమోషనే దక్కుతోంది. ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పలేదుగా. నవంబర్ 4న. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అవుతుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com