లైసెన్స్ లేకుండా ప్రయాణికుల రవాణా: ఆరు ట్యాక్సీలు సీజ్
- October 18, 2022
దుబాయ్: లైసెన్స్ లేకుండా ప్రయాణికులను రవాణా చేస్తున్న ఆరు వాహనాలను(ట్యాక్సీలు) సీజ్ చేసినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. దుబాయ్ పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అథారిటీ పేర్కొంది. తనిఖీల్లో భాగంగా అల్ ఘుబైబాలో నిబంధనలు పాటించని 39 రవాణా వాహనాలకు జరిమానాలు విధించినట్లు తెలిపింది. వాటిల్లో 22 ప్రయాణీకుల రవాణా కోసం లైసెన్స్ లేని వాహనాలు, మరో 17 వాహనాలు అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించినవి ఉన్నాయన్నారు. అదే విధంగా ఉల్లంఘనలకు పాల్పడిన 693 కేసుల్లో జరిమానాలు జారీ చేసినట్లు అథారిటీ పేర్కొంది. ప్రజా రవాణా మోడ్లు, సౌకర్యాలు, సేవలను ఉపయోగించి ఛార్జీలు చెల్లించకుండా ఫేర్ జోన్లలోకి ప్రవేశించడం/నిష్క్రమించడం లాంటివి 591 కేసులు ఉండగా.. నోల్ కార్డ్‌ను చూపించడంలో విఫలమైనవి మరో 33 ఉన్నాయని ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!