అప్పుడు తమ్ముడి కోసం. ఇప్పుడు అన్న కోసం కష్టపడుతున్న సన్నీ లియోన్...
- October 18, 2022
బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ తెలుగులో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా. పాయల్ రాజ్‌పుత్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సన్నీలియోన్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తోంది.
ఈ నెల 21న ‘జిన్నా’ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా యూనిట్ గట్టిగానే ప్రమోషన్లు చేస్తోంది. అలాగే, సన్నీలియోన్ కూడా తనవంతుగా సోషల్ మీడియాలో సినిమాని ప్రమోట్ చేస్తోంది.
తన వంతుగా ప్రమోషన్ అంటే ఏముందిలెండి. హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోందంతే, తద్వారా తనకు ఫాలోయింగ్, అలాగే సినిమాకి ప్రమోషన్.. రెండూ జరిగిపోతున్నాయన్న మాట. ఇక, సినిమా విషయానికి వస్తే, హీరోయిన్ పాయల్ పాత్ర కన్నా, సన్నీలియోన్ పాత్రకే ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత వుండబోతోందట.
ఈ సినిమాలో నటించినందుకు సన్నీలియోన్ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుందనీ ప్రచారం. కాగా, గతంలో సన్నీలియోన్, మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘కరెంట్ తీగ’ సినిమాలో స్పెషల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా హిట్ కాలేదు. ఇప్పుడీ సినిమా అయినా హిట్టవుతుందో లేదో.? చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







