ఇన్‌స్టాలో రికార్డులు సృష్టించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.!
- October 18, 2022
టాలీవుడ్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ సంగతి తెలిసిందే. ఇంతవరకూ కేవలం టాలీవుడ్‌కే పరిమితమైన చరణ్ ఇమేజ్, ‘ఆర్ఆర్ఆర్’ పుణ్యమా అని, బాలీవుడ్‌నీ తాకింది. ఆ మాటకొస్తే, యావత్ ప్రపంచం చుట్టేసింది. నార్త్ జనం చరణ్‌ని రాముడిలా భావిస్తున్నారు. అదంతా ‘ఆర్ఆర్ఆర్’ ఇంపాక్టే.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా కారణంగా, చరణ్‌కి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది ఇన్‌స్టాలో. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా, లేటెస్టుగా రికార్డులు కొల్లగొట్టాడు ఇన్‌స్టా వేదికగా రామ్ చరణ్. చాలా తక్కువ సమయంలోనే 9 మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకున్న ఘనతను చేజిక్కించుకున్నాడు రామ్ చరణ్.
ఓ పక్క హీరోగా తన సినిమాలు తాను చేసుకుంటూనే, మరోవైపు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ఫుల్ నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు చరణ్.
ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు చరణ్. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ఇది. ఈ సినిమాతో మరోసారి ప్యాన్ ఇండియాపై తన అస్ర్తం విసరనున్నాడు చరణ్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో చరణ్ ఓ డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది.
రీసెంట్గా లీకైన ఈ సినిమా ఫోటోలు చరణ్‌ని డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నాయ్. అంజలి, కియార అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా రామ్ చరణ్‌కి 15 వ సినిమా కావడం విశేషం. ఇంత తక్కువ సినిమాలకే నటుడిగా తండ్రి మెగాస్టార్ చిరంజీవినే మించిపోయాడన్న ప్రశంసలు చరణ్‌కి దక్కుతుండడం విశేషం.
తాజా వార్తలు
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే