కువైట్‌లో నిర్మాణ, ఆహార రంగాలలో కార్మికుల కొరత!
- October 19, 2022
కువైట్: కరోనా మహమ్మారి తరువాత సహాయక కార్మికుల కొరతను కువైట్ ఎదుర్కొంటుంది. దీంతో నిర్మాణ, ఆహార రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ప్రతి కంపెనీకి అనుమతించిన కార్మికుల సంఖ్యపై అధికారులు విధించిన షరతుల కారణంగా విదేశాల నుండి కార్మికులను రిక్రూట్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నిర్మాణ సంస్థలు, ఫుడ్ ఇండస్ట్రీ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా వేసవి సెలవులు ముగియడంతో ఇళ్ల నిర్మాణానికి డిమాండ్ పెరగిందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. నిర్మాణ సంస్థ మేనేజర్ ఒకరు మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో సగటు వేతనాలు 100 శాతం పెరిగాయని, సాంకేతిక కార్మికుల వేతనాలు 200 శాతం పెరిగాయన్నారు. మహమ్మారి సమయంలో ప్రభుత్వ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల నిర్మాణ సంస్థలు వందలాది మంది అనుభవజ్ఞులైన, సమర్థవంతమైన కార్మికులను కోల్పోయేలా చేశాయన్నారు. ఆహార రంగంలో శిక్షణ పొందిన, అర్హత కలిగిన కార్మికుల కొరత వేధిస్తుందని ఒక రెస్టారెంట్ యజమాని తెలిపారు. మహమ్మారి సమయంలో బాగా ప్రభావితమైన మొదటి, అతిపెద్ద రంగాలలో ఆహార రంగం ఒకటన్నారు. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిపోర్టు ప్రకారం.. కువైట్‌లోని ప్రైవేట్ రంగంలో సుమారు 1.6 మిలియన్ల ప్రవాసులు పనిచేస్తుండగా.. 73,000 మంది పౌరులు మాత్రమే పనిచేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న దాదాపు 205,000 మంది ప్రవాసులు 2021లో కువైట్‌ను విడిచిపెట్టారు. ఇది స్థానిక వ్యాపారాలను, ముఖ్యంగా హాస్పిటాలిటీ, రిటైల్ రంగాలను దెబ్బతీసింది. 2021లో దాదాపు 41,200 మంది గృహ కార్మికులు కువైట్‌ను శాశ్వతంగా విడిచిపెట్టారని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కువైట్‌లోని 2.7 మిలియన్ల శ్రామికశక్తిలో గృహ కార్మికులు 22.8 శాతం మాత్రమే ఉన్నారు.
తాజా వార్తలు
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!