విమానంలో మెర్క్యూరీ.. ప్రయాణికుడికి 5ఏళ్ల జైలుశిక్ష

- October 19, 2022 , by Maagulf
విమానంలో మెర్క్యూరీ.. ప్రయాణికుడికి 5ఏళ్ల జైలుశిక్ష

బహ్రెయిన్: కువైట్‌కు వెళ్లే విమానంలో ప్రమాదకరమైన రసాయనం ‘మెర్క్యూరీ(పాదరసం)’  తీసుకెళ్లిన ఒక విమాన ప్రయాణీకుడికి 5 ఏళ్ల జైలుశిక్ష పడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 62 ఏళ్ల పాకిస్థానీ మే 25న గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్‌లో తన లగేజీలో 8 కేజీల మెర్క్యూరీ దాచుకొని తీసుకెళ్లాడు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి భద్రతా అధికారులకు తెలిపారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారించిన హై క్రిమినల్ కోర్టు పాకిస్థాన్ ప్రయాణికుడికి 5 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com