ఏపీకి రాజధాని ఒకటేనని తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ

- October 19, 2022 , by Maagulf
ఏపీకి రాజధాని ఒకటేనని తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ

అమరావతి: ఏపీ రాజధాని విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన స్పందనను తెలియజేసారు. ఏపీకి రాజధాని ఒకటేనని, అది అమరావతే అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని అంశం వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన రాజధాని అమరావతి కాదని , మూడు రాజధానుల అంశాన్ని వైస్సార్సీపీ తెరపైకి తీసుకొచ్చింది. ఓ పక్క అమరావతి రైతులు అమరావతి రాజధానికి మద్దతుగా పాదయాత్ర చేస్తుంటే..వైస్సార్సీపీ మాత్రం మూడు రాజధానులు మొగ్గు చూపిస్తుంది.

ఇలాంటి తరుణంలో .‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా ఏపీలో పాదయాత్ర చేస్తున్న రాహుల్..ఏపీ రాజధాని విషయంలో తన స్పందనను తెలిపారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన మంచిది కాదన్నారు. అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటే బాగుంటుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తనను కలిశారని , వాళ్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. పోలవరంతో సహా విభజన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రందే అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎవరితో పొత్తులు అనేది అధ్యక్షునిదే తుది నిర్ణయమని రాహుల్ గాంధీ చెప్పారు. తాను ఎలాంటి పాత్ర పోషించాలనేది పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారన్నారు. గతంలో జరిగిన రాష్ట్ర విభజన గురించి కాకుండా భవిష్యత్ గురించి ఆలోచించాలని రాహుల్ సూచించారు. కాంగ్రెస్‌లో ఉన్నంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ ఉండదని, కాంగ్రెస్‌లో తప్ప ఏ పార్టీలోనూ నేతలు అసంతృప్తి బహిరంగంగా తెలియజేయరని రాహుల్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలలో డిక్టేటర్ షిఫ్ ఉంటుంది కాబట్టి ఇతర నేతలు ఎవరూ మాట్లాడలేరన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com