యూఏఈలో 17 రకాల కంటెంట్ వెబ్‌సైట్‌లపై నిషేధం

- October 19, 2022 , by Maagulf
యూఏఈలో 17 రకాల కంటెంట్ వెబ్‌సైట్‌లపై నిషేధం

యూఏఈ: నివాసులు, పౌరుల భద్రతకు విఘాతం కలిగించే 17 రకాల కంటెంట్ కలిగిఉన్న వెబ్‌సైట్‌లపై యూఏఈ నిషేధం విధించింది. ఆన్‌లైన్ కంటెంట్ ఎమిరెట్స్ లోని మతపరమైన, నైతిక విలువలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తారని యూఏఈ స్పష్టం చేసింది. యూఏఈ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్‌ను కలిగి ఉన్నదని పేర్కొంది. యూఏఈ నివాసితులు ప్రతిరోజూ ఎనిమిదిన్నర గంటల కంటే ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతారని, వరల్డ్ వైడ్ వెబ్‌లో అన్ని రకాల వెబ్‌సైట్‌లు ఉన్నా అవన్నీ యూఏఈలో యాక్సెస్ కావు. ఈ మేరకు యూఏఈ టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) ఇంటర్నెట్ యాక్సెస్ మేనేజ్‌మెంట్ (IAM) రెగ్యులేటరీ పాలసీని అమలు చేస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 883 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశారు. వీటిలో దాదాపు సగం (435) అశ్లీలతకు సంబంధించిన కంటెంట్‌ను కలిగి ఉన్నాయి. దాదాపు 377 (43 శాతం) వెబ్‌సైట్‌లు ఫిషింగ్, ఫ్రాడ్ కంటెంట్ కారణంగా నిషేధానికి గురయ్యాయి. యూఏఈ నిషేధించిన 17 కంటెంట్లు ఇవే.   

1. బ్లాక్ చేయబడిన కంటెంట్‌ను ప్రాక్సీ సర్వర్‌లు, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (VPNలు) సాయంతో తిరిగి చూపించేవి.

2. అశ్లీలత, నగ్నత్వం, వైస్ కంటెంట్ సైట్లు.

3. మోసం, ఫిషింగ్, ఫ్రాడ్ ప్రోత్సాహించే కంటెంట్.

4. ఇతరులను అవమానించడం, అపవాదు, పరువు తీసే కంటెంట్.

5. గోప్యతపై దాడి

6. యూఏఈ, పబ్లిక్ ఆర్డర్‌లను తప్పుపట్టే కంటెంట్.

7. నేరపూరిత చర్యలు, క్రిమినల్స్ కు మద్దతు, నేరపూరిత చర్యలను ప్రోత్సాహంచే కంటెంట్

8. డ్రగ్స్ సంబంధం ఉన్నవి.

9. చట్టాన్ని ఉల్లంఘించే వైద్య, ఔషధ పద్ధతులు తెలిపేవి.

10. మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనకు సంబంధించినవి.

11. వివక్ష, జాత్యహంకారం, మతాన్ని ధిక్కరించడం లాంటి కంటెంట్.

12. వైరస్లు, హానికరమైన కార్యక్రమాల ప్రకటనలు ప్రోత్సహించేవి.

13. నిషేధించబడిన వస్తువులు, సేవలను ప్రోత్సహించడం లేదా వ్యాపారం చేయడం

14. అక్రమ కమ్యూనికేషన్ సేవలు

15. జూదానికి సంబంధించిన సైట్లు.

16. తీవ్రవాదాన్ని ప్రోత్సాహించే కంటెంట్, సైట్లు.

17. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com