బ్యాంకింగ్ మోసాలు: సౌదీ కీలక సూచనలు
- October 19, 2022
రియాద్ : సున్నితమైన బ్యాంకింగ్ డేటాను ఇతరులతో పంచుకోవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. ముఖ్యంగా పాస్వర్డ్లు, యాక్టివేషన్ కోడ్లను బహిర్గతం చేయవద్దని కోరింది. అలాగే మొబైల్ ఫోన్‌కు పంపిన కస్టమర్ బ్యాంక్ కార్డ్ సీక్రెట్ నంబర్, పాస్వర్డ్, యాక్టివేషన్ కోడ్ (OTP) కోసం ఏ బ్యాంకు ఉద్యోగి అడగరని, వీటిని ఎవరికీ తెలపవద్దని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సౌదీ ఫెడరేషన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ సహకారంతో సౌదీ బ్యాంక్స్ మీడియా, బ్యాంకింగ్ అవేర్నెస్ కమిటీ ప్రారంభించిన భారీ జాతీయ అవగాహన ప్రచారంలో భాగంగా మంత్రిత్వ శాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది. "జాగ్రత్తగా ఉండండి" అనే నినాదంతో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అన్ని సౌదీ బ్యాంకులు, రాజ్యంలో సంబంధిత అధికారిక సంస్థల భాగస్వామ్యంతో ఈ క్యాంపెయిన్ కొనసాగుతోంది. ఆర్థిక మోసాల బారిన పడకుండా ఉండటానికి, బ్యాంకింగ్ కస్టమర్ల వ్యక్తిగత ఆధారాల గోప్యతను కాపాడుకోవడానికి వివిధ రకాల ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యం. ఆర్థిక మోసాలకు గురైన వారు సమీప పోలీస్ స్టేషన్ లేదా “కులునా అమ్న్” యాప్ ద్వారా సంప్రదించాలని మంత్రిత్వ శాఖ కోరింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ఫోన్ నంబర్ 911 లేదా మిగిలిన ప్రాంతాల్లో 999కి కాల్ చేయడం ద్వారా నేరాలను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలు, నివాసులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..