దీపావళి: పాఠశాలలకు 4 రోజుల సెలవులు!

- October 20, 2022 , by Maagulf
దీపావళి: పాఠశాలలకు 4 రోజుల సెలవులు!

యూఏఈ: దీపావళి పండుగను జరుపుకునేందుకు వీలుగా దుబాయ్‌, షార్జాలోని చాలా పాఠశాలలు సోమవారం, మంగళవారం (అక్టోబర్ 24-25) సెలవులు ప్రకటించాయి. ఇక శనివారం-ఆదివారం వీకెండ్ సెలవుతో కలిపితే, మొత్తంగా పాఠశాలల విద్యార్థులకు ఈ దీపావళికి నాలుగు రోజుల వారాంతపు సెలవులు రానున్నాయి. కొన్ని పాఠశాలలు అక్టోబర్ 24న  దీపావళి ఫెయిర్‌ను కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీనికి విద్యార్థులతోపాటు వారి పేరెంట్స్ , భారతీయ కమ్యూనిటీ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు పాఠశాలల మేనేజ్ మెంట్లు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com