ఈ నెల 24న దీపావళి సెలవు దినం..
- October 20, 2022
హైదరాబాద్: దీపావళి సందర్భంగా ఈ నెల 24(సోమవారం)ను సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీపావళి ఎప్పుడన్న విషయంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. చివరకు సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 25న (మంగళవారం) అమావాస్య అని క్యాలెండర్లలో ఉంది. దీపావళిని ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు.
దీపావళిని ప్రదోష వేళ (సూర్యాస్తమయ సమయంలో) నిర్వహిస్తారు. ఈ నెల 25నే అమావాస్య తిథి ఉన్నప్పటికీ ప్రదోష వేళ వచ్చేసరికి పాడ్యమి ఘడియలు వచ్చాయని పండితులు అంటున్నారు. 25న సాయంత్రం 4.25 గంటల లోపు అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేస్తుందని చెబుతున్నారు. దీంతో సూర్యాస్తమయానికి అమావాస్య ఉండడం లేదని, 24న సాయంత్రం 4.25 గంటల సమయానికి అమావాస్య ప్రారంభమవుతోందని వివరించారు.
పండితులు సైతం దీపావళిని 24నే జరుపుకోవాలని అంటుండడంతో ఆ రోజునే ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 24నే ధనలక్ష్మి పూజలు నిర్వహించాలని పండితులు చెబుతున్నారు. దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని చాలా మంది జరుపుకుంటారు. 24న మధ్యాహ్నం అమావాస్య తిథి లేకపోవడంతో మరుసటి రోజు వ్రతం జరుపుకోవాల్సి ఉండగా, కానీ 25న సూర్యగ్రహణం ఉండడంతో అందుకు వీలు ఉండదు. గ్రహణం విడిచిన అనంతరం సాయంత్రం వేళ జరుపుకోవాలని కొందరు చెప్పారు. అయితే, పండుగ రోజే ఆ వ్రతాన్ని ఆచరించే పద్ధతి ఉండడంతో 24నే వ్రతం చేసుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!