2 మిలియన్లకు పైగా ఉమ్రా వీసాలు జారీ
- October 21, 2022
రియాద్ : మొహర్రం 1, 1444 (జూలై 30, 2022)న ప్రారంభమైన ప్రస్తుత ఉమ్రా సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 176 దేశాల వారికి రెండు మిలియన్లకు పైగా వీసాలు జారీ చేశారు. అత్యధిక సంఖ్యలో ఉమ్రా యాత్రికులను పంపిన దేశాల్లో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అగ్రస్థానంలో ఉందని హజ్, ఉమ్రా, విజిట్ జాతీయ కమిటీ సభ్యుడు హనీ అల్-ఒమైరి తెలిపారు. ఇండోనేషియా తర్వాత ఇరాక్, టర్కీ, పాకిస్థాన్, మలేషియా, ఇండియా, అజర్‌బైజాన్ ఉన్నాయన్నారు. రానున్న కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఉమ్రా యాత్రికుల రద్దీ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ప్రస్తుత సంవత్సరం 1444 మొదటి త్రైమాసికంలో గ్రాండ్ మస్జీదును సందర్శించిన దేశీయ, విదేశీ ఉమ్రా యాత్రికుల సంఖ్య 30 మిలియన్లకు పైగా చేరుకుందని ప్రకటించింది. ఈ కాలంలో ప్రవక్త మస్జీదును సందర్శించి ప్రార్థనలు చేసిన వారు 40 మిలియన్లకు పైగా ఉన్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!