తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీగా GWAC
- October 21, 2022
తెలంగాణ: తెలంగాణ గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం అధ్యక్షులు దోనికేని కృష్ణ ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న ప్రవాస తెలంగాణ కార్మికులను చేరదీసి దుబాయ్ కేంద్రంగా 15 సెప్టెంబర్ 2016 న ఆవిర్భావించిన గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ (GWAC)అనే ఉద్యమ స్వచ్చంద సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీగా పురుడుపోసుకోనుంది.తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కార్మిక హక్కుల సాధన కోసం జి డబ్ల్యూ ఏ సి గత ఏడు సంవత్సరాలుగా గల్ఫ్ బాధితులకు అనేక విధాలుగా సేవలందిస్తూ వారి హక్కులకోసం మరియు ఎన్ఆర్ఐ పాలసీ సాధనకోసం వివిధ రూపాల్లో పోరాటం చేస్తుండడం గమనించదగ్గ విషయం.గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక త్వరలోనే రాజకీయా పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో గల్ఫ్ ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేయనున్నట్లు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శివసాయి గార్డెన్స్ లో ఈరోజు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యవర్గ సమావేశంలో సభ్యులందరు గల్ఫ్ కార్మికుల హక్కులు సాధించాలంటే ప్రధాన రాజకీయ పార్టీలకు అతీతంగా జి డబ్ల్యూ ఏ సి ఉద్యమ సంస్థనే కాకుండా రాజకీయ శక్తిగా ఎదగాలని అప్పుడే హక్కులు సాధించగలమని తీర్మానం చేసారని అధ్యక్షులు కృష్ణ దొనికేని పేర్కొన్నారు.
GWAC కార్యవర్గ సమావేశంలో సభ్యులందరూ ముక్తకంఠంతో గల్ఫ్ కార్మికులు రాజకీయాల్లోకి రావాలని వారి హక్కులు సాధించుకోవడానికి మరియు ఆత్మగౌరవం గౌరవం నిలబెట్టుకోవడానికి రాజకీయ పార్టీ స్థాపించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గల్ఫ్ కార్మికుల సత్తా చాటాలనే తీర్మానాన్ని ఏకీభవించారు .
తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని,గతంలో ఇచ్చినహామీలను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, గల్ఫ్ కార్మికుల అవగాహనా వేదిక ద్వార ఎన్ని పోరాటాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చూసిన గల్ఫ్ కార్మికులను చిన్నచూపు చూస్తు గల్ఫ్ కార్మికులను ఎన్నికల్లో ఓటు బ్యాంక్ గా రాజకీయ పబ్బంగడుపుకోవడం కోసం వాడుకుంటున్న రాజకీయ పార్టీలు వారు నడుపుతున్న ప్రభుత్వాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని అందుకే రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయకార్యాచరణ తో ముందుకెళ్లాలని కార్యవర్గ సమావేశం నిర్ణయించిందని అధ్యక్షులు కృష్ణ దొనికేని వివరించారు.
సంస్థలో అందరి అభిప్రాయాలను గౌరవించి అలాగే మేధావి వర్గాలను సంప్రదించి లీగల్ అడ్వైజరీ టీమ్ సూచనల మేరకు గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబసభ్యుల జీవన విధానానికి దగ్గర ఉండేలా వారి హక్కులు, ఆశయాలు, వారి ఆత్మగౌరవం నిలబెట్టేలా జెండా, ఎజెండా, పార్టీ పేరును మరియు పార్టీ విధి విధానాలు అతి త్వరలో ప్రకటిస్తామని GWAC అధ్యక్షులు కృష్ణ దోనికేనీ తెలిపారు.గల్ఫ్ కార్మికుల హక్కుల సాధనకోసం గల్ఫ్ కార్మిక కుటుంబాలను కలిసి ఐక్యం చేయడంతో పాటు అనుబంధ విభాగాలైన గల్ఫ్ స్వచ్చంద సేవ మరియు సాంస్కృతిక సంఘాల నాయకులు, సభ్యులు విశ్రమించకూడదని ప్రజల్లోకి వెళ్లాలని గల్ఫ్ అవగాహనా వేదిక అధ్యక్షులు కృష్ణ దొనికేని కోరారు.
ఈ సమావేశంలో అధ్యక్షులు కృష్ణ దొనికెనీ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెండ్ల, ముఖ్య సలహాదారులు మరియు యూఏఈ శాఖ అధ్యక్షులు రవి కటుకం, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సముద్రాల, చందుర్తి మండల అధ్యక్షులు మోతే రాములు, సౌది శాఖ అధ్యక్షులు లక్ష్మణ్ బడుగు,సౌది శాఖ ఉపాధ్యక్షులు చిన్నయ్య, బహ్రెయిన్ శాఖ ఉపాధ్యక్షులు రాజేశ్వర్ పెంకుల, కువైట్ శాఖ ఉపాధ్యక్షులు దేవిలాల్ బుఖ్య, నిర్మల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ రపల్లి, ఆర్మూర్ మండల అధ్యక్షులు వసంత్ రెడ్డి, డిజిటల్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ ఎల్కపల్లి, సోషల్ మీడియా ఇంచార్జ్ కిట్టు గంగపుత్ర, దేశాల ఏరియా వైస్ ఇంచార్జ్లు, కోర్డినేటర్లు,వివిధ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జి డబ్ల్యూ ఏ సి సాంస్కృతిక విభాగం సభ్యులు పాల్గొన్నారు.
మన హక్కుల సాధనకోసం నా గల్ఫ్ అన్న మద్దతు కావాలి, అలాగే గల్ఫ్ సేవ మరియు సాంస్కృతిక సంఘాల అధినేతలు మరియు సంఘాల సభ్యులు మరియు ప్రతి ఒక్కరి మద్దతు కావాలని కోరుతున్నాము.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!