మేనేజర్ల అనుమతితో ‘మూన్‌లైటింగ్’కు ఇన్ఫోసిస్ అనుమతి..
- October 21, 2022
మేనేజర్ల అనుమతితో ‘మూన్‌లైటింగ్’కు ఇన్ఫోసిస్ అనుమతి..
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ‘మూన్‌లైటింగ్’కు అనుమతించింది. అయితే, అనేక షరతులు విధించింది. కొద్ది రోజులుగా ‘మూన్‌లైటింగ్’పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఒక కంపెనీలో పని చేస్తూ, అలాంటి మరో కంపెనీలో రెండో ఉద్యోగం (పార్ట్ టైమ్/ఫుల్ టైమ్) చేయడాన్నే ‘మూన్‌లైటింగ్’ అంటారనే సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అంశంపై దృష్టి పెట్టిన కంపెనీలు దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అనేక కంపెనీలు ‘మూన్‌లైటింగ్’కు పాల్పడుతున్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. తాజాగా దీనిపై ఇన్ఫోసిస్ కీలక సూచనలు చేసింది. తమ ఉద్యోగుల ‘మూన్‌లైటింగ్’కు అనుమతించింది. మేనేజర్ల అనుమతితో ‘మూన్‌లైటింగ్’ చేసుకోవచ్చని తెలిపింది. కానీ, ఈ విషయంలో కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం.. ‘మూన్‌లైటింగ్’ చేయాలంటే ఇన్ఫోసిస్ కంపెనీకి పోటీగా ఉన్న సంస్థల్లో పని చేయరాదు.
అలాగే తమ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలి. ఈ అంశంపై కంపెనీ తమ ఉద్యోగులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ గిగ్ వర్క్స్ లేదా మూన్‌లైటింగ్ అని మాత్రం చెప్పలేదు. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి చెందిన ఉద్యోగులు రెండో ఉద్యోగం చేస్తూ మరికొంత ఆదాయం సంపాదించుకునే వీలుంటుంది. మరోవైపు కంపెనీ నుంచి వలసలు కూడా తగ్గుతాయి.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







