ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై తప్పుడు ఆరోపణలు.. ఏడు రోజుల కస్టడీ

- October 21, 2022 , by Maagulf
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై తప్పుడు ఆరోపణలు.. ఏడు రోజుల కస్టడీ

మనామా: ఉత్తర గవర్నరేట్‌లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని కించపరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఏడు రోజుల కస్టడీకి తరలించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఈ ఘటనపై విచారణ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నివాసాన్ని ఫోటో తీయడం, అతని నైతికతను కించపరిచే విధంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వాటిని సోషల్ మీడియాలో పబ్లిష్ చేశాడు. ఎలక్టోరల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కమిటీ మందు నిందితుడు తన తప్పును ఒప్పుకున్నట్లు కమిటీ ఛైర్మన్ అడ్వకేట్ జనరల్ మెహన్నా అల్ షైజీ తెలిపారు. సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేశానని, అభ్యర్థిని దూషించే ప్రకటనలను ప్రచురించి, బహిరంగంగా దూషించానని, అభ్యర్థి ప్రతిష్టను దిగజార్చడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలనుకుంటున్నట్లు నిందితుడు అంగీకరించాడని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. చట్టం, రాజ్యాంగంలో నిర్దేశించినట్లు ఇతరుల హక్కులు, స్వేచ్ఛలకు భంగం కలుగకుండా తమ అభిప్రాయం తెలపేందుకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వినియోగించుకోవచ్చని అల్ మెహన్నా అన్నారు. ఎన్నికల ప్రక్రియ, సమగ్రత, పారదర్శకతకు హామీ ఇచ్చే వాతావరణంలో జరుగుతుందన్నారు. ఇతరుల స్వేచ్ఛను లక్ష్యంగా చేసుకోకుండా.. నిజాయితీ, నిష్పక్షపాతమైన విధానాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం చేసుకోవాలని అల్ మెహన్నా సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com