బాలయ్య ‘వీర సింహారెడ్డి’: వైబ్రేషన్ మామూలుగా లేదుగా.!
- October 22, 2022
నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న కొత్త సినిమాకి తాజాగా టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్యకు బాగా కలిసొచ్చిన ‘సింహా’ వచ్చేలా తాజా టైటిల్‌ని ఫిక్స్ చేశారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్ పెట్టారు. గతంలో బాలయ్య నటించిన చాలా సినిమాల్లో ‘సింహా’ వచ్చేలా టైటిల్స్ పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని ఫెయిల్యూర్స్ వున్నప్పటికీ ఆయా సినిమాల్లో సెన్సేషనల్ హిట్ సినిమాలే ఎక్కువ.
ముఖ్యంగా ‘సమరసింహా రెడ్డి’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అలాంటి సంచలనాలనే తాజా సినిమా ‘వీర సింహారెడ్డి’ క్రియేట్ చేస్తుందని మేకర్లు నమ్ముతున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
గతంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కర్నూల్ కొండారెడ్డి బురుజు వేదికగా ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసి మరీ ఈ సినిమాకి టైటిల్ రిలీజ్ చేశారు. శృతిహాసన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంగా, సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







