అనూ ఇమ్మాన్యుయేల్‌కి కోపమొచ్చింది.! ఫైర్ బ్రాండ్‌లా మారిపోయింది.!
- October 22, 2022
ప్రెస్ మీట్స్ పేరు చెప్పి,అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసి సెలబ్రిటీలను విసిగిస్తుంటారు కొందరు మీడియా మిత్రులు.అన్నిసార్లూ సంయమనం పాఠించలేరు కదా. కొన్ని సార్లు సహనం కోల్పోతుంటారు సెలబ్రిటీలు.తాప్సీ, కంగనా రనౌత్ వంటి ఫైర్ బ్రాండ్స్ విషయంలో మీడియా ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంటుంది.
అయితే, కూల్ అండ్ కామ్‌గా కనిపించే అనూ ఇమ్మాన్యుయేల్‌కి తాజాగా కోపమొచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ జంటగా, రాకేష్ శశి దర్శకత్వంలో ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది అనూ ఇమ్మాన్యుయేల్.
ఈ నేపథ్యంలో ఓ విలేఖరి అనూ ఇమ్మాన్యుయేల్‌ని అడిగిన ప్రశ్నకు విస్తుపోయే సమాధానమిచ్చింది అనూ ఇమ్మాన్యుయేల్. అన్నయ్య అల్లు అర్జున్‌తో, తమ్ముడు శిరీష్‌తోనూ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు కదా.. ఇద్దరిలో ఎవరు క్యూట్.? ఎవరు నాటీ.? అని ఆ విలేఖరి అనూని ప్రశ్నించాడు.
నిజానికి అందులో కోపమొచ్చేంత ఇష్యూ ఏమీ లేదనుకోండి. కానీ, ఎందుకో అనూకి కోపమొచ్చేసింది. ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలియదా.? అంటూ రుసరుసలాడింది. ప్రశ్నలు అడిగే ముందు కాస్త ఆలోచించుకుని అడగండి అంటూ మండి పడింది. ఈ ఇష్యూ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







