గడువు తేదీకి ఏడు రోజుల ముందే ‘విజిట్ వీసా’ పొడిగింపు
- October 23, 2022
సౌదీ: విజిట్ వీసా గడువు తేదీకి ఏడు రోజుల ముందు చెల్లుబాటు అయ్యే వైద్య బీమాను కలిగి ఉంటే పొడిగించవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) తెలిపింది. వ్యక్తులకు విజిట్ వీసా అబ్షర్ ప్లాట్‌ఫారమ్‌లోని హోస్ట్ ఖాతా ద్వారా దాని చెల్లుబాటు గడువు ముగియడానికి ఏడు రోజుల ముందు పొడిగించబడుతుందని, ఈ విధానాన్ని పూర్తి చేయడానికి సందర్శకుడికి నిర్దిష్ట షరతులకు అనుగుణంగా వైద్య బీమా ఉండాలని స్పష్టం చేసింది. విజిట్ వీసా మొత్తం పొడిగింపు 180 రోజులకు మించకూడదని జవాజాత్ పేర్కొంది. అయితే విజిట్ వీసా గడువు తేదీ నుండి మూడు రోజులు దాటితే దాని పొడిగింపును ఆలస్యం చేసినందుకు జరిమానా విధించబడుతుందని తెలిపింది. విజిటర్ వీసాను రెసిడెన్షియల్ వీసాగా మార్చడం సాధ్యం కాదని జవాజత్ తెలిపింది.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







