ప్రైవేట్ రంగ కార్మికుల గైర్హాజరీ కోసం కొత్త నిబంధనలు
- October 25, 2022
సౌదీ: ప్రైవేట్ రంగ సంస్థల్లో కార్మికుల గైర్హాజరీని నియంత్రించే నిబంధనల్లో సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అప్డేట్ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం.. కార్మికునితో ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు యాజమాన్యం అభ్యర్థన సమర్పించిన తర్వాత కార్మికుడి డేటా నుంచి పేరు తొలగించబడుతోంది. అలాగే కార్మికుడు 60 రోజులలోపు మరొక యజమానికి బదిలీ చేయడానికి లేదా తుది నిష్క్రమణకు హక్కు ఉంటుంది. 60 రోజులు గడిచిన తర్వాత కూడా ప్రవాస కార్మికుడు ‘ప్రవాస కార్మికుడు’ స్థితిని మంత్రిత్వ శాఖలో కొనసాగుతుంది. కార్మికుడిని నియమించుకునేందుకు కొత్త యజమానులను అనుమతించబడుతుందని, దానికి కార్మికుడు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొత్త యాజమన్యానికి సేవల బదిలీకి కార్మికుడికి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తేదీ నుండి 15 రోజులలోపు ప్రవాస వర్కర్ సర్వీస్ బదిలీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో కార్మికుడి స్టేటస్ లో మార్పు ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







