ఎమిరేట్స్‌లో పాక్షిక సూర్యగ్రహణం.. జాగ్రత్తలు

- October 25, 2022 , by Maagulf
ఎమిరేట్స్‌లో పాక్షిక సూర్యగ్రహణం.. జాగ్రత్తలు

యూఏఈ: ఈ సంవత్సరం చివరి పాక్షిక సూర్యగ్రహణం మరికొద్ది సమయంలో ఏర్పడనుంది. యూఏఈలో మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు రెండు గంటలపాటు ఈ ప్రక్రియ సాగనుంది. పాక్షిక సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళ రేఖపైకి వస్తాయి.

-దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ప్రకారం.. యూఏఈలో తదుపరి పాక్షిక సూర్యగ్రహణం 2027లో వస్తుంది.

-కంటి రక్షణ లేకుండా గ్రహణం సమయంలో సూర్యుడిని చూడొద్దు. దీని వల్ల కంటిచూపు దెబ్బతింటుంది. చూపు కూడా పోయే ప్రమాదం ఉంటుంది.

- గ్రహణాన్ని చూడాలంటే సోలార్ ఫిల్టర్లు లేదా మూడు సంవత్సరాల కంటే పాతది, గీతలు లేని ఎక్లిప్స్ గ్లాసెస్ తప్పనిసరిగా ఉపయోగించాలి.

- మీకు రక్షణ చర్యలు లేని సమయంలో సూర్య గ్రహణాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించడం క్షేమకరం.

-దుబాయ్‌లోని మస్జీదులలో అసర్ (సాయంత్రం) ప్రార్థనల తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com