కువైట్లో 655,000కి చేరుకున్న గృహ కార్మికుల సంఖ్య
- October 25, 2022
కువైట్: మొత్తం ప్రవాస కార్మికులలో నాలుగింట ఒక వంతు మంది గృహ కార్మికులని, 2022 రెండవ త్రైమాసికం చివరి నాటికి వీరి సంఖ్య దాదాపు 655,000కు పెరిగిందని కువైట్ లేబర్ డిపార్టుమెంట్ తెలిపింది. 2021 రెండవ త్రైమాసికం చివరి నాటికి ఈ సంఖ్య 639,000గా ఉందన్నారు. ఇందులో దాదాపు 315,000 మంది పురుషులు, దాదాపు 339,000 మంది మహిళలు ఉన్నారు. మొత్తం గృహ కార్మికులలో భారతీయులు 46.2 శాతంతో కువైట్లో అగ్రస్థానంలో.. ఫిలిప్పీన్స్ 24.7% మందితో రెండవ స్థానంలో ఉంది. భారతదేశానికి చెందిన పురుష గృహ జాబితాలో (213,000 మందితో) అగ్రస్థానంలో ఉండగా.. మహిళా గృహ కార్మికుల్లో ఫిలిప్పీన్స్ 161,000 మందితో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశం, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా 10 దేశాల వారు మొత్తం గృహ కార్మికుల సంఖ్యలో 95.1 శాతం ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







