‘వీరయ్య’ వెర్సస్ ‘వీరసింహం’.! గెలుపెవరిదో.!

- October 25, 2022 , by Maagulf
‘వీరయ్య’ వెర్సస్ ‘వీరసింహం’.! గెలుపెవరిదో.!

ఈ సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు రేస్‌లో వున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ నటిస్తున్న ‘ఆది పురుష్’తో పాటూ, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’, నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద పోరుకు దిగుతున్నాయ్.
ఈ పోరులో ముఖ్యంగా ‘వీర సింహం’, ‘వీరయ్య’ పోరు ఆసక్తిని కలిగిస్తోంది. ఓ పక్క మెగాస్టార్, మరోపక్క నటసింహం.. ఇద్దరికీ ప్రెస్టిజియస్ మూవీసే ఇవి. ఇరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్ అవుతుందంటూ రచ్చ మొదలెట్టేశారు.
అభిమానులేమో ఇలా వుంటే, హీరోల మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ వుండవు. చాలా సార్లు ఎదురైన ఇలాంటి పరిస్థితులతో హీరోలు తమదైన శైలిలో అభిమానులకు సంకేతాలు అందించినా, మా హీరో గొప్పంటే, మా హీరో గొప్ప.. అన్న బేధాబిప్రాయాలు అభిమానుల్లో పోవడం లేదు.
తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమా స్టోరీ బాలయ్య వద్దకు వస్తే, ఆ కథ నా కన్నా, పవన్ కళ్యాణ్‌కి అయితే చాలా బాగుంటుంది.. అని బాలయ్యే రికమెండ్ చేశాడట. స్వయంగా ఈ విషయాన్ని బాలయ్యే చెప్పడం అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. హీరోల మధ్య అనుబంధం అలా వుంటే, ఆయా హీరోల మధ్య గొడవలకు మాత్రం చెక్ పడడం లేదు. 
ఇక, సంక్రాంతికి రాబోయే మెగాస్టార్ వీరయ్య, బాలయ్య ‘వీర సింహం’ సినిమాల పట్ల ఇప్పటి నుంచే రచ్చ మొదలెట్టేశారు. ఈ సారి బాలయ్య, చిరంజీవి అభిమానుల్ని ఎలా సముదాయిస్తారో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com