హ్యూమన్ రైట్స్ ఆరోపణలను ఖండించిన ఖతార్
- October 26, 2022
ఖతార్: ఖతార్‌లోని భద్రతా దళాలు గత నెలలో ఎల్జీబీటీ వర్గాలను ఏకపక్షంగా అరెస్టు చేశాయని హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యు) ఆరోపణలను ఖతార్ ఖండించింది. సంప్రదాయవాద ముస్లిం దేశమైన ఖతార్ లో స్వలింగసంపర్కం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అయితే, తొలిసారి మిడిల్ ఈస్ట్ లో నిర్వహిస్తున్న ఫిపా వరల్డ్ కప్ 2022లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులకు ఖతార్ అహ్వానం పలుకుతుందని ఖతార్ స్పష్టం చేసింది. హెచ్ఆర్డబ్ల్యూ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. బహిరంగంగా ప్రేమాభిమానాలను ప్రదర్శించే విషయంలో ఇతర దేశాల వారు స్థానిక కట్టుబాట్లు, చట్టాలు, నిబంధనలను గౌరవించాలని కోరింది. అంతకుముందు ఖతార్ లో నలుగురు ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేసి చిత్రహింసల పెట్టినట్లు హెచ్ఆర్డబ్ల్యు ఆరోపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







