ఇండియన్ ఎంబసీలో ఘనంగా 7వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు
- October 26, 2022
కువైట్: ధన్వతరి జయంతిని పురస్కరించుకొని భారత రాయబార కార్యాలయం 7వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంది. కువైట్ లోని ఎంబసీ ప్రాంగణంలో అక్టోబర్ 23న 7వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కువైట్లోని భారత రాయబారి HE సిబి జార్జ్ తరపున ప్రథమ కార్యదర్శి (సంస్కృతి), డాక్టర్ వినోద్ గైక్వాడ్ పాల్గొని మాట్లాడారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కువైట్లోని భారతీయులందరికీ, కువైట్లోని భారతీయ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయుర్వేదం ప్రకృతితో మనిషి అనుబంధాన్ని తెలియజేస్తోందన్నారు. ఈ సంవత్సరం ‘హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదం’ ఇతివృత్తంతో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో యోగా, ఆయుర్వేదం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఆదరణ పొందుతున్నాయని డాక్టర్ వినోద్ గైక్వాడ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







