ఆ షాంపూల విక్రయాలు యూఏఈ లేవు.. భయం వద్దు
- October 27, 2022
యూఏఈ: దుబాయ్ నివాసితులు కార్సినోజెనిక్ షాంపూలు, యుఎస్‌లో రీకాల్ చేయబడిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. క్యాన్సర్ కారక బెంజీన్ కంటెంట్ కారణంగా కొన్ని ఏరోసోలైజ్డ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లకు వ్యతిరేకంగా US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. యూనిలీవర్(Unilever Plc), డోవ్‌తో సహా అనేక ప్రసిద్ధ బ్రాండ్‌ల ఏరోసోల్ డ్రై షాంపూలను రీకాల్ చేశాయి. అలాగే రొకాహోలిక్, బెడ్ హెడ్ డ్రై షాంపూలను తయారు చేసే నెక్సస్(Nexxus), సావే(Suave), ట్రెసెమ్మె(Tresemmé), టిగి(Tigi) వంటి బ్రాండ్‌లు సైతం తమ షాంపులను రికాల్ చేశాయి. యూఎస్ మార్కెట్‌లలో విక్రయించబడే ఉత్పత్తులు యూఏఈలో ఉన్న వాటికి భిన్నంగా ఉంటాయని, వినియోగదారుల ఉత్పత్తుల గురించిన వార్తలు, పుకార్ల గురించి జాగ్రత్తగా ఉండాలని మున్సిపాలిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఇక్కడ స్థానికంగా తయారు చేయబడిన, దిగుమతి చేయబడిన ఉత్పత్తులు సమగ్ర నియంత్రణ వ్యవస్థకు లోబడి ఉంటాయన్నారు. దుబాయ్‌లోని లైసెన్స్ పొందిన వ్యాపార సంస్థలలో సాధారణ తనిఖీలు నిర్వహించబడతాయన్నారు. ప్రజలకు ఏవైనా సందేహాలుంటే నివాసితులు కాల్ సెంటర్ 800900 ద్వారా లేదా దుబాయ్ మునిసిపాలిటీ స్మార్ట్ అప్లికేషన్‌లోని MONTAJI ద్వారా మునిసిపాలిటీని సంప్రదించవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!







