ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ
- October 27, 2022
విజయవాడ: టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ అలీకి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ పదవి అందించింది. ఎప్పటి నుంచో అలీకి సీఎం జగన్ కీలక పదవి ఏదో ఒకటి ఇస్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే తాజాగా అలీకి… ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. అయితే ఈ విషయం తెలిసిన పలువురు సినీనటులు అలీకి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే సలహాదరు పదవికి సాధారణంగా .. రూ.3 లక్షల వరకూ అందుతాయి. అదనంగా కొన్ని అలవెన్స్లు వస్తాయి.ఏపీ ప్రభుత్వానికి ఉన్న లెక్క లేనంత మంది సలహాదారుల్లో చాలా మందికి అవే వస్తాయి. వారి జాబితాలో ఇప్పుడు అలీ కూడా చేరిపోయారు.అయితే కొందరు మాత్రం అదేం పెద్ద పదవి కాదని… పెదవి విరుస్తున్నారు.ఇంతకాలం వెయిట్ చేస్తే.. ఇంత చిన్న పదవినా ఇచ్చేదా అని అలీ అభిమానులు అంటున్నారు.పదవి కాలం రెండేళ్లు అయినా.. జగన్ ప్రభుత్వంకు మరో ఏడాదిన్నర మాత్రమే ఉంది. అంటే.. మరో ఏడాదిన్నర తర్వాత ఎన్నికలు రానున్నాయి.దీన్ని బట్టి చూస్తే అలీకి పదవి ఉండేది కూడా ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత ప్రభుత్వం మారితే.. సలహాదారులకు సమస్యలు తప్పవని కూడా కొందరు అంటున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







