అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా తొమ్మిది మందిని రక్షించిన సీడీఏఏ

- October 28, 2022 , by Maagulf
అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా తొమ్మిది మందిని రక్షించిన సీడీఏఏ

మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లో నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదం నుండి ఒక చిన్నారి సహా తొమ్మిది మందిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. దక్షిణ అల్ సాదా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు సీడీఏఏ వెల్లడించింది. ఆ భవనం నుంచి  చిన్నారితో సహా తొమ్మిది మంది కుటుంబాన్ని హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com