అవినీతి ఆరోపణలు.. కేఏయూ అధ్యక్షుడిని తొలగించిన రాజు సల్మాన్
- October 28, 2022
రియాద్ : రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ గురువారం కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్శిటీ (KAU) అధ్యక్షుడు డాక్టర్ అబ్దుర్రహ్మాన్ అల్-యౌబీని తొలగించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాజు వేటు వేశారు. దీంతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. అల్-యౌబీకి వ్యతిరేకంగా ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయల్ డిక్రీ పేర్కొంది. అల్-యౌబీ తన అధికారిక అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్, ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడ్డాడని రాయల్ ఆర్డర్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







