రుణ భయంతో.. భారతీయ ప్రవాస వ్యక్తి ఆత్మహత్య!

- October 28, 2022 , by Maagulf
రుణ భయంతో.. భారతీయ ప్రవాస వ్యక్తి ఆత్మహత్య!

బహ్రెయిన్: భారతీయ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతుడిని రాజీవ్ చెలాపురం (40)గా గుర్తించినట్లు వెల్లడించారు. రెంటల్ కంపెనీలో పనిచేసే రాజీవ్.. భారీగా రుణాలు పొందినట్లు తెలుస్తుందన్నారు. రుణాలను తిరిగి చెల్లించే విషయంలో రాజీవ్ తీవ్ర మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలుస్తోందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాజీవ్ సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం గుర్తించినట్లు  పోలీసులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com