హింసాత్మక ఘటనల్లో పాల్గొంటే బహిష్కరణే.. ప్రవాసులను హెచ్చరించిన కువైట్
- October 28, 2022
కువైట్: భద్రతను పెంచడానికి కువైట్ చర్యలు తీసుకుంటున్నది.ఇందులో భాగంగా హింసాత్మక ఘటనలు, మరేదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బహిష్కరణ కేసులకు మంత్రిత్వ శాఖ లేదా అండర్ సెక్రటరీ నుండి నిర్ణయం అవసరం లేదని.. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించాలని చట్టం చెబుతోందని, ఈ చర్యలు మానవ హక్కులకు విరుద్ధం కాదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల హవల్లి, మహబౌలా, సాల్మియా, అల్-రెగ్గే ప్రాంతాల్లో హింసాత్మక ప్రవర్తనలు పెరగడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే బహిష్కరణకు గురైన వారు దోషులుగా తేలితే జరిగిన నష్టాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







