ఢిల్లీలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం
- October 28, 2022
న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో గాలినాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలో శుక్రవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 329గా నమోదైంది. నగరంలో అత్యధికంగా అత్యధికంగా ఆన్‌విహార్‌లో 834గా రికార్డయింది. రోహిణి, ఝిల్‌మిల్, సోనియా విహార్‌లో గాలి నాణ్యత పేలవమైన స్థాయికి చేరుకుంది. ఇక ఢిల్లీ రాజధాని ప్రాంత పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లో కూడా గాలి నాణ్యత పడిపోయింది. గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయి.
కాగా, పంజాబ్, హర్యానాలో జరిగిన ఫైర్స్ వల్ల కూడా పొల్యూషన్ పెరిగిందని అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి 12వందలకు పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు. రానున్న రోజుల్లో పొల్యూషన్ తగ్గే అవకాశం ఉందన్న అధికారులు…. ప్రస్తుతం వెరీ పూర్ కేటగిరిలో ఉండగా మరో ఆరు రోజుల్లో పూర్ కేటగిరిలోకి చేరే చాన్స్ ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్‌కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్‌లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









