‘యశోద’ ట్రైలర్ టాక్.! సమంత మళ్లీ హిట్టు కొట్టేలానే వుందిగా.!

- October 28, 2022 , by Maagulf
‘యశోద’ ట్రైలర్ టాక్.! సమంత మళ్లీ హిట్టు కొట్టేలానే వుందిగా.!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ‘యశోద’. ఇటవల రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 
ట్రైలర్‌కి ఇంకా ఆదరణ దక్కుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా కట్టి పడేసింది ‘యశోద’ ట్రైలర్. సమంత నటన, యాక్షన్ ఎపిసోడ్స్, సినిమా కథాంశం అన్నీ ఆసక్తికరంగా సాగుతున్నాయ్.
సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చివర్లో ‘యశోద ఎవరో తెలుసు కదా.. మా కృష్ణ పరమాత్ముణ్ని పెంచిన తల్లి..’ అంటూ సమంత చెప్పిన డైలాగ్ ఒక్కటీ చాలు ‘యశోద’ సూపర్ హిట్ అవ్వడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.
ఈ మధ్య కృష్ణ తత్వం నేపథ్యంలో వచ్చిన ‘కార్తికేయ 2’ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే సెంటిమెంట్ ఈ సినిమాకీ వర్తించేలా వుంది. అంతేకాదు, కథ, కథనం కూడా ఆసక్తికరంగా సాగినట్లు తోస్తుండడంతో సమంత ఖాతాలో ‘యశోద’ మరో సూపర్ హిట్‌గా నిలవడం ఖాయమంటున్నారు సినీ మేథావులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com