మొన్న కొరటాల, ఇప్పుడు పూరీ.! మోసగాళ్ల లిస్టులో చేరిపోయారట.!
- October 28, 2022
‘ఆచార్య’ సినిమా ఇచ్చిన రిజల్ట్‌తో కొరటాల శివ ఇంకా కొట్లాడుతూనే వున్నారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో, నిర్మాతలూ, డిస్ట్రిబ్యూటర్లు.. మేం నష్టపోయాం బాబోయ్ అంటూ కొరటాల ఇంటిపై దండెత్తి వచ్చిన సంగతి తెలిసిందే.
అలా అలా రచ్చ జరిగాకా, మొత్తమ్మీద ఎంతో కొంత సెటిల్మెంట్ చేసి, కొరటాల వాళ్ల నోళ్లు మూయించినట్లున్నారు. ఆ గొడవ కాస్త చల్లారిందనుకుంటే, ఇప్పుడు మళ్లీ పూరీ ముచ్చట కొత్తగా తెరపైకి వచ్చింది.
ఇటీవలే ‘లైగర్’ మూవీతో పూరీ జగన్నాధ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, సేమ్ టు సేమ్, ‘ఆచార్య’ మాదిరిగానే నష్టాలను మిగిల్చింది.
‘ఆచార్య’ ఇచ్చిన స్పూర్తి వుండనే వుంది కదా. అదే స్పూర్తితో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పూరీ ఆఫీస్‌పై దండయాత్ర చేశారు. తమకు జరిగిన నష్టాన్ని పూడ్చాలని పూరీపై ఒత్తిడి తీసుకొచ్చారు.
ఈ సినిమాకి పూరీ జగన్నాధ్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, సినిమాని కొన్న డిస్ర్టిబ్యూటర్లు.. పూరీని మోసగాడిగా అభివర్ణిస్తూ సెటిల్మెంట్ కోసం గొడవకు దిగారు.
ఈ నేపథ్యంలోనే ఇష్యూ కాస్త సీరియస్ కావడంతో, డిస్ట్రిబ్యూటర్ల నుంచి తనకు ప్రాణ హాని వుందంటూ, పోలీసులనాశ్రయించారు పూరీ జగన్నాధ్. పూరీకి ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అండగా నిలిచారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







