యష్ కూడా ప్రబాస్లాగే ఇబ్బంది పడుతున్నాడా.?
- October 28, 2022
‘బాహుబలి’ సినిమాతో ప్రబాస్ ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాకా ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో తేల్చుకోలేక ఇబ్బంది పడ్డాడు. ఇప్పటికీ పడుతూనే వున్నాడు. ఎన్ని సినిమాలు చేసినా, దాన్ని ‘బాహుబలి’తో పోల్చుతుండడం, ఆ అంచనాల్ని మరే సినిమా అందుకోలేకపోవడం ప్రబాస్‌కి పెద్ద తలనొప్పిలా మారింది.
ఇక, అదే సమస్యతో బాధపడుతున్నాడట కన్నడ నటుడు యష్ కూడా. ‘కేజీఎఫ్ ఛాప్టర్స్’తో యష్ కూడా ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. దాంతో తర్వాత తాను ఎంచుకోబోయే ప్రాజెక్టులపై క్లారిటీ లేక, సతమతమవుతున్నాడు.
మామూలుగా అయితే, ఇప్పటికే యష్ నుంచి మరో సినిమా వచ్చేయాల్సి వుంది. కానీ, ‘కేజీఎఫ్’ దెబ్బతో, కథల ఎంపికలో తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నాడట. కథలు వింటూనే వున్నాడట. తొందరపడకుండా ఆచి తూచి అడుగేయాలని భావిస్తున్నాడట. బాలీవుడ్ నుంచి కొందరు దర్శకులు యష్‌తో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారట.
కానీ, సౌత్ డైరెక్టర్ల పైనే యష్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాగోలేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే, యష్ ఏమాత్రం టెంప్ట్ కాకుండా, సౌత్ డైరెక్టర్ల పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. యష్ లిస్టులో అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లు వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







