65 డ్రగ్ ఏజెన్సీలకు SR1.6 మిలియన్ల జరిమానా

- October 29, 2022 , by Maagulf
65 డ్రగ్ ఏజెన్సీలకు SR1.6 మిలియన్ల జరిమానా

సౌదీ: సెప్టెంబర్‌లో డ్రగ్స్(మందులు) నిల్వలపై నివేదికలు సమర్పించని 65 ఫార్మాస్యూటికల్ ఏజెన్సీలకు జరిమానాలు విధించినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)తెలిపింది. ఆయా ఏజెన్సీలు రిజిస్టర్డ్ ఉత్పత్తుల సరఫరాలో కొరత లేదా అంతరాయాన్ని నివేదించడంలో.. అలాగే వాటిలో కొన్ని రిజిస్టర్డ్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను అందించడంలో విఫలమయ్యాయని అథారిటీ పేర్కొంది. ఆమోదించబడిన ఇ-మానిటరింగ్ సిస్టమ్ ఆర్ఎస్డీలో(RSD) 24 ఫ్యాక్టరీలు/ డ్రగ్ ఏజెంట్లు డ్రగ్స్ షార్టేజీపై వివరాలు తెలుపలేదు.. 8 ఔషధ సంస్థలు 12 ఉత్పత్తులను సరఫరా చేయడంలో విఫలమయ్యాయని, 15 సంస్థలు ఆశించిన వాటిని నివేదించడంలో విఫలమైనందుకు వాటిపై చర్యలు తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఫార్మాస్యూటికల్, హెర్బల్ ఫెసిలిటీస్ అండ్ ప్రిపరేషన్స్ లా.. దాని ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్‌లో నిర్దేశించిన జరిమానాల ప్రకారం ఉల్లంఘించిన సంస్థలపై SR1.6 మిలియన్ల జరిమానా విధించినట్లు అథారిటీ వెల్లడించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com