పవన్ సినిమాలో ఆ బాలీవుడ్ నటుడు.!
- October 29, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న‘హరి హర వీరమల్లు’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయ్.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి బాలీవుడ్ వన్నెలు అద్దబోతున్నారు మేకర్లు.
తాజాగా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌కి సంబంధించి తాజాగా అప్‌డేట్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన పాత్ర పేరును పరిచయం చేస్తూ అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
బాబీ డియోల్ ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం మొదట అర్జున్ రాంపాల్‌ని అనుకున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, సడెన్‌గా ఆ ప్లేస్‌లోకి బాబీ డియోల్ వచ్చి చేరాడు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







