ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు..
- October 31, 2022 
            కివ్: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులతో దాడి చేసింది. రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాల్లో విద్యుత్తు, నీటి సరఫరా నిలిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కీవ్‌లో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. కీవ్ జిల్లాలో విద్యుత్తు సరఫరా జరగడం లేదు. ఖార్కీవ్ నగరంలో కీలక కేంద్రాలను టార్గెట్ చేశారు. క్రిమియాలోని నల్లసముద్రం దళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందన్న ఆరోపణలపై రష్యా మిస్సైల్‌ను ఫైర్ చేసింది.
సోమవారం ఉదయం విన్నిసియా ప్రాంతంపై కూడా దాడి జరిగింది. జపొరిజియా ప్రాంతంలో ఉన్న హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌పై కూడా దాడి జరిగింది. కీవ్‌లో సుమారు 3.5 లక్షల మందికి సరఫరా అయ్యే విద్యుత్తుకు కూడా అంతరాయం ఏర్పడింది. తాజా దాడుల్లో ఎంత మంది మరణించారన్న విషయం ఇంకా తెలియలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ నిర్ణయం







