ప్రవాసుల కోసం రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేసిన షార్జా
- October 31, 2022 
            యూఏఈ: ప్రవాసుల కోసం రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ చట్టం 2010లో షార్జా ఎమిరేట్ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు చట్టంలోని సవరణ నెం. (5) లో మార్పులు చేస్తూ సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి చట్టం నెం. (2) 2022ని జారీ చేశారు. 2010 నాటి లా నంబర్ (5)లోని ఆర్టికల్ (4) ప్రకారం.. ఎమిరేట్‌లో రియల్ ఎస్టేట్‌ను సొంతం చేసుకునే హక్కు యూఏఈ పౌరులు, జీసీసీ పౌరులకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే, ఈ చట్టానికి మినహాయింపుగా యాజమాన్య హక్కును ఇతరులకు బదిలీ చేసేందుకు తాజాగా వీలు కల్పించారు. పాలకుల ఆమోదం, చట్టపరమైన నోటిఫికేషన్, వారసత్వ బదిలీ, యజమాని తన మొదటి-స్థాయి బంధువులలో ఒకరికి ఇవ్వడం, మండలి నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి ప్రాంతాలు, ప్రాజెక్టులలో యాజమాన్యం హక్కులను బదిలీ చేయవచ్చు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







