గుజరాత్‌లో కేబుల్ వంతెన దుర్ఘటన: భారత్‌కు ఒమన్‌ సంతాపం

- October 31, 2022 , by Maagulf
గుజరాత్‌లో కేబుల్ వంతెన దుర్ఘటన: భారత్‌కు ఒమన్‌ సంతాపం

మస్కట్: మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ వంతెన కూలిన ఘటనపై ఒమన్ సుల్తానేట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఇండియాలోని గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం కేబుల్ వంతెన కూలిపోయిన ఘటనలో 140 మంది మరణించగా.. వందలాది మంది మచ్చు నదిలో పడి గాయపడ్డారు. వంతెన కూలిన సమయంలో దానిపై దాదాపు 350 మంది వరకు పర్యాటకులు ఉన్నారని, మృతుల్లో పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని అధికారులు తెలిపారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు మచ్చు నదిపై 230 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. 8 నెలలపాటు వంతెనకు పునరుద్ధరణ పనులు జరిపి అక్టోబర్ 26న కేబుల్ వంతెనను పర్యాటకుల కోసం తెరిచారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com