‘ఆదిపురుష్’ తగ్గి తీరాల్సిందే.! తప్పేదే లే.!

- October 31, 2022 , by Maagulf
‘ఆదిపురుష్’ తగ్గి తీరాల్సిందే.! తప్పేదే లే.!

సంక్రాంతి రేస్‌లో ‘ఆదిపురుష్’ అని ఊరికి ముందే.. అదేనండీ.. ఎప్పుడో కన్‌ఫామ్ చేసేశారు మేకర్లు. ఆ తర్వాతే చిరంజీవి, బాలయ్య వంటి అగ్ర హీరోలు రేస్‌లోకి వచ్చారు. ఇదీ వాస్తవం. 
అయితే, అందరి కన్నా ముందు రేస్‌లో నిలిచిన ‘ఆది పురుష్’ ఇప్పుడు వెనక్కి తగ్గక తప్పేలా కనిపించడం లేదు. ప్యాన్ ఇండియా సినిమా అయిన ‘ఆదిపురుష్‌కి సంక్రాంతి లాంటి సీజన్ వుండాలి. కానీ, పోటీ మాత్రం ఆ స్థాయిలో వుండకూడదనేది కొందరు సినీ మేధావుల ఉచిత సలహా.
ఉచితమే అయినా ఆ సలహానీ తూచా తప్పకుండా పాఠించాలనుకుంటోందట ‘ఆది పురుష్’ టీమ్. రేస్ నుంచి పక్కకు తప్పుకోవాలనుకుంటోందట. దాదాపు నిర్ణయం తీసేసుకున్నట్లే. ఇక, అధికారిక ప్రకటన ఒక్కటే తరువాయి.
అంతేకాదు, ‘ఆదిపురుష్’ టీజర్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. అది కూడా సరిచేసుకుని తీరాల్సిందే. టెక్నికల్ వర్క్ స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు కూడా ఇంకాస్త టైమ్ అవసరమయ్యేలా వుందన్నది తాజా సమాచారమ్. సో, ఆయా కారణాల వల్ల ‘ఆది పురుష్’ని రేస్ నుంచి తప్పించేసినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com