‘పుష్ప 2’ : అలా కానిచ్చేస్తున్నారా.!
- October 31, 2022
‘పుష్ప’ తొలి పార్ట్ అనూహ్యమైన విజయం అందుకోవడంతో, ‘పుష్ప 2’ సెట్స్ మీదికి వెళ్లడానికే చాలా సమయం పట్టింది. దాదాపు సంవత్సరం పాటు స్ర్కిప్టు పనులకే తీసుకున్నారు సుకుమార్ అండ్ టీమ్.
ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ లుక్ టెస్టులు జరుగుతున్నాయనీ సమాచారం.
తాజాగా అల్లు అర్జున్, సినిమాటోగ్రాఫర్‌తో కలిసి దిగిన ఓ స్టిల్ ఈ సినిమా శరవేగంగా ముందుకు కదలబోతోందన్న అంశాన్ని ప్రూవ్ చేసింది. ఇక, త్వరలోనే ‘పుష్ప 2’ని పట్టాలెక్కించేయనున్నారనీ తెలుస్తోంది.
లాంగ్ టైమ్ స్ర్కిప్టు వర్క్ కోసం తీసుకోవడంతో, పర్‌ఫెక్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు పక్కా ప్రణాళికతో సిద్దం అవుతోందట టీమ్ అంతా. ఇంతవరకూ ఎక్కువ టైమే తీసుకోవడంతో, ఇక రెగ్యులర్ షూటింగ్ రాకెట్ స్పీడుతో కానిచ్చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ‘పుష్ప 2’ ను సక్సెస్ ఫుల్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
రష్మికా మండన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ పార్ట్‌కి సంబంధించి మెయిన్ విలన్ కానున్నారన్న విషయాన్ని మొదటి పార్ట్‌లోనే హింట్ ఇచ్చేశారు. మొదటి పార్ట్‌కి మించిన వేగంతో ఈ పార్ట్ స్ర్కీన్‌ప్లే వుండబోతోందన్న ఆసక్తిని కూడా అప్పుడే క్రియేట్ చేసేశారు. ఇంకేముంది. . లెట్స్ వెయిట్ ఫర్ ‘పుష్ప ది రూలింగ్’.!
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







